ఏపీ(AP) సీఎం (CM) చంద్రబాబు (Chandrababu) బృందం ఇటీవల సింగపూర్ (Singapore) పర్యటనకు వెళ్లొచ్చింది. సింగపూర్ పర్యటన గురించి వివరిస్తూ గురువారం సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh).. తమ ప్రభుత్వం గురించి చెడుగా సింగపూర్ కంపెనీకి మెయిల్స్ పెట్టించారు అని మాజీ సీఎం వైఎస్ జగన్‌పై నిందలు వేశారు. కాగా, మెయిల్స్‌కు సంబంధించిన సంచలన (Sensational) ఆధారాలు బయటపడ్డాయి. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని సింగపూర్ కంపెనీకి ఈ-మెయిల్ పంపించింది స్వయంగా తెలుగుదేశం పార్టీ వీరాభిమాని, లోకేష్ సన్నిహితుడని ఆధారాలతో సహా బయటపడ్డాయి.

నిన్న సాయంత్రం ప్రెస్మీట్లో నారా లోకేష్ మాట్లాడుతూ.. సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ (Murali Krishna) అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపారని, ఈ-మెయిల్ పెట్టిన మురళీకృష్ణకు వైయస్ఆర్ సీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయని, మాజీ మంత్రి పెద్దిరెడ్డి పెట్టించారంటూ వ్యాఖ్యానించారు. ఆ మురళీ కృష్ణ అనే వ్యక్తి చిలకలూరిపేటకు చెందిన మురళీ మోహన్ చౌదరి అన్న చర్చ నడుస్తోంది. ట్విట్టర్లో Murali USA @tollywood ఐడీతో అకౌంట్ నడుపుతున్న మురళీ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు వీరాభిమాని. చినబాబుకు హార్ట్‌కోర్ ఫ్యాన్. కాని, మురళీని కూడా ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం కాటేసిందని అనేకసార్లు ఆయనే వాపోయారు. అనేక వీడియోలు, పోస్టింగ్స్ తో ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టారు. జగన్ నిజాయితీ ఉన్న సరైన నాయకుడని ఇటీవలే ప్రశంసించారు.

ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కోసం మురళీ విపరీతంగా కష్టపడ్డారు. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మురళీ, భార్యాపిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. టీడీపీ కోసం అక్కడున్న ఏపీ ప్రజలతో మీటింగ్‌లు నిర్వహించి టీడీపీ గెలిపించాలని వారందరితో ప్రతిన చేపించిన మురళీ.. అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అదే పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను గెలిపించుకున్న పార్టీ తనకు, తన కుటుంబానికి అన్యాయం చేస్తోందని ఎదురుతిరిగారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అనుచరులు తన ఆస్తిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, శ్రీ కార్తికేయ సిటీ సెంటర్లోని తన మాల్ ను తన పార్టీ నేతలే కొట్టేసేందుకు పన్నాగం పన్నారని, తనకు న్యాయం చేయాలని తన ట్విట్టర్ ఖాతా నుంచి చంద్రబాబు, లోకేష్, పవన్‌ను ట్యాగ్ చేస్తూ అనేక ట్వీట్లు పోస్ట్ చేశారు.

తన షాపింగ్ మాల్ ఎదుట చెత్త డంపింగ్ చేసి మానసికంగా వేధించారని, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారంటూ వీడియోలు రిలీజ్ చేశాడు. 70 ఏళ్ల వయసున్న తన తల్లిని, తండ్రిని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు. అయినా అటు ప్రభుత్వం నుంచి ఇటు పోలీసుల నుంచి న్యాయం జరగకపోవడంతో అసహనం చెందిన మురళీ కూటమి ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. కోట్ల రూపాయల తన ఆస్తిని కొట్టేయాలని కుట్రలు చేస్తున్నారని కడపుమంటతో తాను నడుపుతున్న Murali USA @tollywood హ్యాండిల్ నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ తన నిరసనను వ్యక్తం చేస్తున్నాడు.

ఏపీలో రేపోమాపో ప్రభుత్వం మారిపోతుంది సింగపూర్ కంపెనీకి మెయిల్స్ చేసింది తానేనని టీడీపీకి వ్యతిరేకిగా మారిన వీరాభిమాని మురళీ ఓ ట్వీట్ ద్వారా హింట్ ఇచ్చినట్టుగా చర్చ జరుగుతోంది. రాత్రి నాలుగు పెగ్గులేసి.. నాలుగు ఇమెయిల్స్ పంపించా.. ఎవరికీ పంపించానో గుర్తుకు రావడం లేదు.. అంటూ ఓ ట్వీట్ చేయడాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. లోకేష్ ప్రెస్‌మీట్ ముగిసిన తరువాత ట్వీట్ పడడంతో ఆ మెయిల్స్ పంపించింది మురళీనే నెటిజన్లు అంటున్నారు. చంద్రబాబు, నారా లోకేష్‌ల అభిమాని వారికే చెడుగా మెయిల్స్ రాస్తే దాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగట్టడం ఏంటని వైయస్ఆర్ సీపీ ప్రశ్నిస్తోంది.








