నెల్లూరు (Nellore) నగర కార్పొరేషన్ (City Corporation)పై అధికార తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) కన్నుపడింది. మున్సిపల్ శాఖ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న నగర కార్పొరేషన్ వైసీపీ(YSRCP) చేతుల్లో ఉండడంతో దాన్ని టీడీపీ(TDP) వశం చేసుకునేందుకు మేయర్ స్రవంతి (Mayor Sravanthi)పై కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నెల్లూరు మేయర్‌పై అవిశ్వాస తీర్మానం స్థానిక రాజకీయాలు హాట్‌టాపిక్‌గా మారింది.
మొత్తం 54 మంది సభ్యులు ఉన్న నెల్లూరు కార్పొరేషన్‌లో 40 మంది కార్పొరేటర్లు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు (Joint Collector Venkateshwarlu)కు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. స్రవంతిని తొలగించి కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలని కార్పొరేటర్లు స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో నెల్లూరు మున్సిపల్ పాలిటిక్స్‌లో కొత్త చర్చలు నెలకొన్నాయి.
2021 కార్పొరేషన్ ఎన్నికల్లో 54 స్థానాలకు 54 స్థానాలూ గెలిచిన వైసీపీ, నెల్లూరు కార్పొరేషన్‌పై సంపూర్ణ ఆధిపత్యం సాధించింది. ఆ ఎన్నికల అనంతరం మేయర్‌గా స్రవంతి బాధ్యతలు చేపట్టి నేటితో నాలుగేళ్లు పూర్తి కానున్నాయి. అయితే తాజాగా టీడీపీ ఈ పదవిపై కన్నేసి, వైసీపీ గెలిచిన 54 స్థానాల్లో 40 మంది కార్పొరేటర్ల మద్దతు తమకుందని ప్రకటించింది. ఈ మద్దతుతోనే అవిశ్వాస తీర్మానం ముందుకు వచ్చింది.
కూటమి ప్రభుత్వం (Alliance Government) వచ్చాక నగర పంచాయితీలు, కార్పొరేషన్లలో బలం లేకపోయినా కార్పొరేటర్లు, కౌన్సిలర్లను తమవైపునకు తిప్పుకునే ప్రయత్నాలు సాగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల తిరువూరు మున్సిపాలిటీని డబ్బులతో కౌన్సిలర్లను కొనుగోలు చేసి లాక్కున్నామని టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు (TDP MLA Kolikapudi Srinivasa Rao) ఓ టీవీ ఛానెల్ డిబేట్‌లో చెప్పిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇక నెల్లూరులో కూడా అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.








