టీడీపీలో కోవర్టులు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

టీడీపీలో కోవర్టులు.. సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైఎస్సార్ జిల్లా క‌డ‌ప‌ (Kadapa)లో రెండవ రోజు మహానాడు (Mahanadu) సభలో సీఎం చంద్ర‌బాబు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్య‌లు చేశారు. టీడీపీ (TDP)లో కొంతమంది కోవర్టులు (Covert Agents) ఉన్నారని, సొంత పార్టీ శ్రేణుల‌పై కోవ‌ర్టు ముద్ర వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

“మా పార్టీ కార్యకర్తలనే చంపుకుంటున్నట్లు చెడ్డ ప్రచారం చేసి, ప్రజల్లో టీడీపీని అప్రతిష్టకు గురిచేశారు. పల్నాడు (Palnadu)లో హత్యలు (Murders) జరిగాయి.. నాకు అనుమానం వచ్చింది. కొంతమంది మన దగ్గర ఉండి.. వాళ్లకు కోవర్డులకు పనిచేస్తూ, వాళ్ల ప్రోత్సహంతో ఇష్టానుసారం హత్యా రాజకీయాలు చేస్తున్నారు” అని చంద్ర‌బాబు నాయుడు మ‌హానాడు వేదిక‌పై ఆరోపించారు. టీడీపీలో ఉన్న వైసీపీ కోవర్టులు వీరయ్యచౌదరి (Veerayya Chowdary) ని హత్య చేశారని, టీడీపీలో వర్గపోరుతో చంపుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తోందని సీఎం చంద్ర‌బాబు అన్నారు.

టీడీపీలో ఆధిప‌త్య‌పోరే..
కాగా, వీర‌య్య చౌద‌రి హ‌త్య‌కు స్థానికంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆధిప‌త్య పోరే కార‌ణ‌మ‌ని పోలీసులు తేల్చారు. నిందితుల‌ను అదుపులోకి తీసుకొని విచార‌ణ పూర్తి చేసిన అనంత‌రం వారంతా టీడీపీకి చెందినవారేన‌ని తేల్చారు. వీరయ్య చౌదరి స్వగ్రామం అమ్మనబ్రోలులో తెలుగుదేశం పార్టీలో ఆధిపత్య పోరులో భాగంగా ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్దారించారు. అదే గ్రామానికి చెంది‌న ఆళ్ల సాంబయ్య, ఆయన మేనల్లుడు ముప్పా సురేష్‌కి వీరయ్య చౌదరికి మధ్య ఉన్న రాజకీయ ఆధిపత్య పోరులో భాగంగా హత్య జరిగినట్టు నిర్ధారించారు.

టీడీపీలో కోవ‌ర్టులున్నార‌ని జాతీయ అధ్య‌క్ష ప‌ద‌విలో ఉన్న చంద్ర‌బాబు నాయుడు చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. అయితే వీర‌య్య చౌద‌రి హ‌త్య‌కు కార‌ణం ఆధిపత్య‌పోరేన‌ని పోలీసులు తేల్చిన‌ప్ప‌టికీ కేవ‌లం రాజకీయ ల‌బ్ధి కోసం దాన్ని వైసీపీ వైపున‌కు తిప్పేసి, నెపం ప్ర‌త్య‌ర్థుల‌పై నెట్టేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని చంద్ర‌బాబుపై వైసీపీ నుంచి కౌంట‌ర్లు ప‌డుతున్నాయి. కార్య‌క‌ర్త‌లు వ‌ర్గ‌పోరు, ఆధిపత్య పోరు వీడాల‌ని సూచించాల్సిందిపోయి.. వీర‌య్య హ‌త్య‌ను వైసీపీపై నెట్ట‌డం ఏంట‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌శ్నలు వేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment