దెందులూరులో వైసీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం..? (Video)

దెందులూరులో వైసీపీ నేత‌పై హ‌త్యాయ‌త్నం..?

ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగాయి. దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీరామవరం వెళ్తున్న వైసీపీ జిల్లా యువజన విభాగ అధ్యక్షుడు కామిరెడ్డి నానిపై టీడీపీ నేత‌లు మెరుపుదాడి చేశారు.

క్రికెట్ కిట్లు, బీరు సీసాలు, కత్తులతో టీడీపీ దెందులూరు మండల తెలుగు యువత అధ్యక్షుడు మోత్కూరి నాని, ఇతర కార్యకర్తలు కలిసి వైసీపీ నేత నానిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో నాని కారు కూడా ధ్వంసం చేశారు. సంఘటన సమయంలో పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దాడిని అడ్డుకోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడి ప‌థ‌కం ప్ర‌కారం జ‌రిగింద‌ని, యువ‌జ‌న విభాగం నేత నానిని అంత‌మొందించ‌డానికి కుట్ర చేశార‌ని మండిప‌డుతున్నారు.

ఇటీవలే మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిపై కూడా చింతమనేని అనుచరులు దాడికి యత్నించడం, రాడ్లు, కర్రలతో తోటలోకి ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది. తాజాగా కామిరెడ్డి నానిపై దాడి జరగడంతో వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపై కూడా ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. టీడీపీ నేత‌ల అరాచ‌కం పెరిగిపోతోందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్‌ చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment