చిరంజీవి సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్!

చిరంజీవి నిమాలో తమన్నా ఐటమ్ సాంగ్!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి కామెడీ టచ్, చిరంజీవి టైమింగ్ కలవడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో, సినిమాకు కమర్షియల్ హంగులు అద్దేందుకు గాను, ఇందులో ఓ స్పెషల్ సాంగ్‌ను చేర్చినట్టు తాజా సమాచారం.

ఈ ఐటమ్ నంబర్‌లో గ్లామరస్ స్టార్ తమన్నా భాటియా స్టెప్పులేయబోతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే “కావాలయ్యో కావాలయ్యో,” “డా డా డాస్ సూపర్ హిట్” వంటి ఐటమ్ నంబర్స్‌తో తమన్నా మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో, ఈ సారి మెగాస్టార్‌తో కలిసి ఆమె మాస్ ఆడియన్స్‌కు పక్కా ఫీస్ట్ ఇవ్వబోతుందని టాక్ వినిపిస్తోంది.

అనిల్ రావిపూడి ఈ స్పెషల్ సాంగ్‌ డిజైన్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపగా, యూనిట్ ఈ పాట షూటింగ్ కోసం భారీ సెట్‌ను సిద్ధం చేస్తోందట. సినిమా కథాంశం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉన్నప్పటికీ, కమర్షియల్ విజయానికి ఈ మసాలా సాంగ్ అవసరమని భావించి దీన్ని జోడించినట్లు తెలుస్తోంది. ఈ పాటలో చిరంజీవి, తమన్నా ఎనర్జీకి ఎస్.ఎస్. థమన్ అందించే మ్యూజిక్ తోడై థియేటర్లలో పండుగ వాతావరణం సృష్టిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అయితే, ఈ స్పెషల్ సాంగ్‌ గురించి చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment