News Wire
-
01
ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం
జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం. పారదర్శకత కోసమే ఓటర్ జాబితా సవరణ. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి పేరు నమోదు
-
02
కులగణనపై జగన్ హర్షం
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన వైఎస్ జగన్. కులగణనకు సపోర్ట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి. వైసీపీ హయాంలోనే కులగణనపై తీర్మానం.
-
03
పిటిషనర్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
పహల్గామ్ ఉగ్రదాడిపై న్యాయవిచారణ కోరుతూ పిటిషన్. తిరస్కరించిన సుప్రీం కోర్టు. కోర్టు సూచనలతో పిల్ ఉపసంహరణ.
-
04
దేశం విడిచి వెళ్లేందుకు వెసులుబాటు
అటర్నీ సరిహద్దు నుంచి పాక్ వెళ్లేందుకు పాకిస్తానీయులకు అనుమతి. ఇప్పటివరకు 926 పాకిస్తానీయులు స్వదేశం వెళ్లిపోయారు.
-
05
అమరావతి పునఃనిర్మాణ ఆహ్వానపత్రిక
అమరావతి పునఃనిర్మాణ ఆహ్వాన పత్రిక విడుదల. రేపు మ.3 గంకు ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం చేతులమీదుగా పనులు ప్రారంభం
-
06
వీఐపీ బ్రేక్, సిఫార్సు లేఖలు రద్దు
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ నిర్ణయం తీసుకుంది. జూలై 15 వరకు ఈ నిర్ణయం అమలు
-
07
కొవూరులో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం సమీపంలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు ఇంట్లోని వ్యక్తి మృతి.
-
08
సింహాచలం పరిసర ప్రాంతాల్లో వర్షం
వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. కనీస సదుపాయాలు కల్పించడం లో విఫలం అయిన అధికారులు
-
09
హిట్ 3 టికెట్ రేట్ల పెంపు
ఏపీలో వారం పాటు హిట్ 3 సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి. సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75. పెంపు
-
10
సింహాచలం ఘటనపై మోడీ విచారం
భక్తుల మృతిపై పీఎం మోడీ విచారం. పీఎం సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం.