అనంతపురం జిల్లా (Anantapuram District) తాడిపత్రి (Tadipatri)లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Peddareddy) తాడిపత్రికి బయల్దేరగా మరోసారి పోలీసులు (Police) అడ్డుకున్నారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ (Recalling Chandrababu Manifesto) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైసీపీ(YSRCP) సన్నాహాలు చేస్తుండగా, పోలీసులు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ (House Arrest) చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి (Anantha Venkatarami Reddy) సహా వైసీపీ కోఆర్డినేటర్లకు సమావేశానికి అనుమతి ఇస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కేతిరెడ్డిని మాత్రం హాజరు కాకుండా అడ్డుకోవడం స్థానికంగా ఆందోళనకు కారణమైంది. తాడిపత్రిలోకి పెద్దారెడ్డి వెళ్లొచ్చని, పోలీసులు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలిచ్చినప్పటికీ.. పోలీసులు పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 14 నెలలుగా తాడిపత్రిలో శాంతిభద్రతలను (Law And Order) నియంత్రించలేకపోతున్నారని, టీడీపీ నాయకుడు (TDP Leader) జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) సూచనల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో జరగాల్సిన ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని అనుమతించకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. లా అండ్ ఆర్డర్ సమస్యలను కారణంగా చూపుతూ, ఆయనను హౌస్ అరెస్ట్‌లో ఉంచారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం తనకు తాడిపత్రిలో పర్యటించేందుకు భద్రత కల్పించాలని రెండు నెలల క్రితం ఆదేశించినప్పటికీ, పోలీసులు దానిని అమలు చేయడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ఒక వ్యక్తిని తన సొంత ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం న్యాయమా? 14 నెలలుగా శాంతిభద్రతలను నియంత్రించలేని పోలీసులు, జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకే లొంగిపోతున్నారా?” అని కేతిరెడ్డి ప్రశ్నించారు. ఇవాళ తాడిపత్రిలో జరగాల్సిన విస్తృత సమావేశానికి భారీ బలగాలను మోహరించిన పోలీసులు, కేతిరెడ్డిని మినహా మిగిలిన వైసీపీ నాయకులకు అనుమతి ఇచ్చారు. ఈ ఆంక్షలు రాజకీయ కక్షసాధింపు చర్యలని, హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచింది, స్థానికంగా విస్తృత చర్చకు దారితీసింది.
హైకోర్టు ఆదేశాలిచ్చినా అనుమతించరా..? – మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి
— Telugu Feed (@Telugufeedsite) July 18, 2025
14 నెలలుగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సాకుతో అడ్డుకోవడం దుర్మార్గం
ఒక వ్యక్తిని తన సొంత ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం న్యాయమా?
పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలకే లొంగిపోతున్నారా? – మాజీ ఎమ్మెల్యే… pic.twitter.com/COdEVu29po







