నేపాల్ (Nepal)లో అవినీతి (Corruption)కి వ్యతిరేకంగా జరిగిన యువత ఆందోళనల తర్వాత ప్రధాని (Prime Minister) కేపీ శర్మ ఓలి (K.P. Sharma Oli) రాజీనామా (Resignation) చేశారు. ఆయన మంత్రివర్గంలోని చాలామంది సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ పరిస్థితుల్లో, మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి (Sushila Karki) నేపాల్ తాత్కాలిక (Interim) ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సమాచారం. జెన్-జెడ్ (Gen-Z) యువ ప్రతినిధులు ఈమె పేరును తాత్కాలిక ప్రధానిగా ప్రతిపాదించారు. ఆర్మీ, అధ్యక్షుడితో జరిగిన చర్చల అనంతరం అత్యున్నత పదవికి ఆమెను ఎంపిక చేశారు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఆమె పదవీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
జెన్-జెడ్ నిరసనకారులు, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్డెల్ మధ్య జరిగిన ఏకాభిప్రాయం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వానికి చిన్న మంత్రివర్గం ఉంటుందని, మొదటి సమావేశం శుక్రవారం రాత్రే జరగవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మంత్రివర్గం ఫెడరల్ పార్లమెంట్‌తో పాటు ఏడు ప్రాంతీయ పార్లమెంట్లను రద్దు చేయాలని సిఫార్సు చేసే అవకాశం ఉంది.