క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) తన కెప్టెన్సీలో భారత్ ఆసియా కప్ (Asia Cup) 2025ను గెలుచుకున్న తర్వాత గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. ఈ టోర్నమెంట్‌లో ఆడిన మొత్తం ఏడు మ్యాచ్‌ల ఫీజు (Seven Matches Fees)ను భారత సైన్యానికి (Indian Army) విరాళంగా (Donation) ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
సూర్య కుమార్ యాదవ్ మ్యాచ్ ఫీజు వివరాలు:
బీసీసీఐ (BCCI) నియమావళి ప్రకారం, ఒక అంతర్జాతీయ T20 మ్యాచ్‌కు భారత క్రికెటర్లకు రూ. 3 లక్షల మ్యాచ్ ఫీజు లభిస్తుంది. టెస్ట్ మ్యాచ్‌లకు రూ. 15 లక్షలు, వన్డేలకు రూ. 6 లక్షలు చెల్లిస్తారు. ఈ ఫీజులు పురుష, మహిళా క్రికెటర్లకు సమానంగా ఉంటాయి.
ఆసియా కప్ 2025లో సూర్యకుమార్ యాదవ్ 7 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లెక్కన అతనికి లభించిన మొత్తం మ్యాచ్ ఫీజు రూ. 21 లక్షలు (7 x 3 లక్షలు). ఈ మొత్తాన్ని ఆయన భారత సైన్యానికి విరాళంగా ఇచ్చారు. ఈ నిర్ణయంపై ఎలాంటి వివాదం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు.







