దేశవ్యాప్తంగా కోర్టు ప్రాంగణాలు, ట్రిబ్యునల్లలో దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లు, పురుషులు, మహిళల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్. మహదేవన్ నేతృత్వంలోని ధర్మాసనం పారిశుద్ధ్యం ప్రాధాన్యంపై తమ తీర్పు వెలువరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం..
పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండటం ప్రజల ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు తన ప్రకటనలో పేర్కొంది. ఆర్టికల్ 21 కింద హక్కు ప్రతి వ్యక్తి పరిశుభ్రమైన వాతావరణంలో జీవించడానికి అర్హుడు. అన్ని కోర్టు ప్రాంగణాల్లో టాయిలెట్ సౌకర్యాల నిర్మాణానికి తగిన నిధులను కేటాయించాలని ప్రభుత్వాలను ఆదేశించింది. హైకోర్టు ఏర్పాటు చేసే కమిటీలు ఈ అంశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించింది.
40 రోజుల్లో నివేదికలు దాఖలు..
సుప్రీంకోర్టు అందరు పౌరుల హక్కులను పరిరక్షించేందుకు అడుగులు వేస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నాలుగు నెలల లోపు ఈ ఆదేశాల అమలు ప్రగతిపై స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సూచించింది.








