సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (Supreme Court Judges) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఓ ప్రముఖ న్యాయమూర్తి ఇంట్లో లెక్కలేనన్ని డబ్బులు బయటపడటంతో, న్యాయవవస్థపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనితో, న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టేందుకు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు తమ ఆస్తుల (Assets) వివరాలను ప్రకటించాలని నిర్ణయించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) సమక్షంలో జరిగిన పూర్తి కోర్టు సమావేశంలో, సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరూ ఏకగ్రీవంగా (Unanimously) తమ ఆస్తులను వెల్లడించేందుకు అంగీకరించారు. ఈ వివరాలను సుప్రీం కోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో (Supreme Court website) ప్రచురించనున్నారు.
ఇదే తరహాలో, 2009లో కూడా న్యాయమూర్తులు తమ ఆస్తులను స్వచ్ఛందంగా ప్రకటించేందుకు అంగీకరించారు. పారదర్శకతను పెంపొందించేందుకు, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని బలపర్చేందుకు తీసుకున్న ఈ నిర్ణయం నాటి నుండి ఒక కీలక అడుగుగా మిగిలింది. అయితే, తాజా ప్రకటన పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంచడానికి కాదని, అంతర్గత పారదర్శకత కోసం మాత్రమేనని అధికారులు వెల్లడించారు.








