ఈసారి ట్రోఫీ ఆర్సీబీదే.. గ‌వాస్క‌ర్ కీల‌క స్టేట్‌మెంట్‌

ఈసారి ట్రోఫీ ఆర్సీబీదే.. గ‌వాస్క‌ర్ కీల‌క స్టేట్‌మెంట్‌

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (IPL) 2025 సీజ‌న్ విజేత ఎవ‌రో టీమిండియా మాజీ క్రికెట‌ర్ గ‌వాస్క‌ర్ (Gavaskar) చెప్పేశారు. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా టైటిల్ విజేత‌గా నిల‌వ‌ని జ‌ట్టు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (Royal Challengers Bangalore – RCB) ఈసారి టైటిల్ (Title) అందుకోబోతుంద‌ని జోస్యం చెప్పారు స‌న్నీ.

ఈ సీజ‌న్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న RCB ఈసారి ట్రోఫీ (Trophy) గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స‌న్నీ అభిప్రాయపడ్డారు. ముంబై ఇండియన్స్ (MI) కూడా పోటీలో ఉన్నప్పటికీ, ట్రోఫీ దక్కించడం వారి కోసం ఈసారి కష్టమేనని గవాస్కర్ అన్నాడు. IPL ప్రారంభమైన 18 ఏళ్లలో ఒక్కసారి కూడా కప్ అందుకోలేకపోయిన RCBకి ఇది గొప్ప అవకాశం కావచ్చని ఆయన పేర్కొన్నారు. గవాస్కర్ వ్యాఖ్యలపై RCB ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్సీబీకి ఎంతోమంది మ‌హా దిగ్గ‌జాలు నాయ‌క‌త్వం వ‌హించిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క టైటిల్ కూడా కొట్ట‌లేక‌పోయింది. సీజ‌న్లు మారుతున్న‌ప్ప‌టికీ ఆర్సీబీ ఫ్యాన్స్‌లో మాత్రం జోరు ఏమాత్రం త‌గ్గ‌లేదు. జ‌ట్టుపై న‌మ్మ‌కాన్ని పెడుతూనే వ‌చ్చారు. అభిమానుల న‌మ్మ‌కాన్ని ఈసారైనా ఆర్సీబీ నిల‌బెట్టుకుంటుందో.. లేదో చూడాలి అంటున్నారు క్రీడా విశ్లేష‌కులు.

Join WhatsApp

Join Now

Leave a Comment