సుహాస్‌.. మాస్‌.. ‘మండాడి’ ఫస్ట్ లుక్ వ‌చ్చేసింది

సుహాస్‌.. మాస్‌.. ‘మండాడి’ ఫస్ట్ లుక్ వ‌చ్చేసింది

Summarize with AI

టాలీవుడ్ (Tollywood) యువ హీరో సుహాస్ (Suhas) మరోసారి తన విభిన్నమైన లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. కోలీవుడ్ నటుడు (Kollywood Actor) సూరి (Soori)తో కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘మండాడి’(Mandadi) నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ (First Look Poster) విడుదలైంది. మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో సుహాస్ మాస్ లుక్‌ (Mass Look) లో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.

ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు మతిమారన్ (Mathimaaran) తెరకెక్కిస్తున్నారు. మహిమా నంబియార్ (Mahima Nambiar) ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్పోర్ట్స్, యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం జీవీ ప్రకాశ్ కుమార్ అందిస్తున్నాడు. కథా పరంగా, సుహాస్ కు ఇది మరో విలక్షణ ప్రాజెక్ట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ చిత్రంలో సీనియ‌ర్ న‌టులు సత్యరాజ్, అచ్యుత్ కుమార్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. క్రీడా నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని, బలమైన భావోద్వేగాలతో కూడిన ఈ సినిమా జీవన పోరాటం, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందనే అంచనాలు నెల‌కొన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment