ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న సుగాలి ప్రీతి (Sugali Preethi) పేరు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదు అని సుగాలి ప్రీతి తల్లి (Mother) పార్వతి (Parvathi) ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ (Vijayawada)లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై సుగాలి పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉపముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన కూతురు హత్య కేసుపై న్యాయం చేస్తానని హామీ ఇచ్చి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
“నా కూతురిని దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఎనిమిదేళ్లుగా న్యాయం (Justice) కోసం పోరాడుతున్నాను. పవన్ అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం ప్రీతి ఫైల్ (Preethi File)పైనే ఉంటుందని హామీ ఇచ్చినా, 14 నెలలు గడిచినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సీబీఐ(CBI) దర్యాప్తు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి. అసెంబ్లీలో నా కూతురు కేసుపై చర్చ జరగాలి” అని పార్వతి డిమాండ్ చేశారు.
హోం మంత్రిత్వ శాఖ (Home Ministry Department) నిర్లక్ష్యాన్ని (Negligence) కూడా ఆమె తప్పుపట్టారు. హోం మంత్రికి శ్రీకాంత్ (Sreekanth) పెరోల్ (Parole) పై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదు. ఎప్పుడో ముగిసిపోయిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో ప్రత్యేక బృందం వేస్తారు. కానీ నా కూతురు కేసులో ఎందుకు అదే శ్రద్ధ చూపించలేకపోతున్నారు? గిరిజనులు ఓటుకు మాత్రమే పనికొస్తారా? నా కూతురికి న్యాయం చేయలేకపోయిన సేనానిగా పవన్ కల్యాణ్ ఎలా నిలుస్తారు?” అని ప్రశ్నించారు.
న్యాయం కోసం డిజిటల్ క్యాంపెయిన్‌తో పాటు నిరాహార దీక్షకు కూడా సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. “గవర్నర్‌ను కలసి నా ఆవేదన తెలియజేస్తాను. అవసరమైతే జనసేన, టీడీపీ కార్యాలయాల ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడతాను. నా కూతురికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆపను” అని సుగాలి పార్వతి స్పష్టం చేశారు.
తొలి సంతకం తన కుమార్తె కేసే అని చెప్పి.. 14 నెలలు అవుతున్నా @PawanKalyan స్పందించడం లేదు
— Telugu Feed (@Telugufeedsite) August 28, 2025
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నా కుమార్తెకు న్యాయం చేస్తానని మాటిచ్చి, డిప్యూటీ సీఎం అయ్యాక పట్టించుకోవడం లేదు
– సుగాలి ప్రీతి తల్లి pic.twitter.com/3oog9XJHYx







