న్యాయం కోరితే మాపైనే ఆరోప‌ణ‌లా..? ప‌వ‌న్‌పై సుగాలి ప్రీతి త‌ల్లి ఫైర్‌

న్యాయం కోరితే మాపైనే ఆరోప‌ణ‌లా..? ప‌వ‌న్‌పై సుగాలి ప్రీతి త‌ల్లి ఫైర్‌

2017లో జ‌రిగిన ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి సుగాలి ప్రీతి (Sugali Preeti) మృతి కేసు.. ఎనిమిదేళ్ల త‌రువాత రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌తి స‌భ‌లోనూ సుగాలి ప్రీతి పేరును ప్ర‌స్తావించిన ప‌వ‌న్‌(Pavan).. అధికారంలోకి వ‌చ్చాక త‌ల‌నొప్పిగా మారింద‌ని మాట్లాడ‌డంపై మృతురాలి త‌ల్లి (Mother) సుగాలి (Sugali) పార్వ‌తీదేవి (Parvathi Devi) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pavan Kalyan) చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని సుగాలి ప్రీతి తల్లి తీవ్రంగా స్పందించారు.

2017లో టీడీపీ ప్రభుత్వంలో తన కుమార్తెపై అత్యాచారం, హత్య జరిగినా న్యాయం జరగలేదని ఆమె గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ డీఎన్ఏ(DNA) రిపోర్ట్‌లు(Reports) మార్చారని ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాడో త‌మ‌కు అర్థం కావటంలేదన్నారు సుగాలి పార్వ‌తీదేవి. నిందితులు కేసును ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారని, అందుకే తమ గోడును ఎవ్వరు పట్టించుకోవటం లేదన్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న తనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిప‌డ్డారు.

ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ కేసును మూడు నెలల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, పదవిలోకి వచ్చి 14 నెలలు అవుతున్నా న్యాయం జరగలేదని ఆమె ప్రశ్నించారు. పైగా తమపై అసత్య ఆరోపణలు చేయడం తగదని, రెండు ఉద్యోగాలు పవన్ వల్ల కాదని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం జగన్ ప్రభుత్వం ఇచ్చిందని వివరించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం (Government) త‌మ కుటుంబానికి అన్ని ర‌కాలుగా సాయం అందించిందని చెప్పారు. త‌న కుమార్తె మృతికి న్యాయం కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా, రాష్ట్ర అసెంబ్లీ వరకు పోరాటం చేస్తానని, నిందితులకు శిక్ష పడే వరకు తన పోరాటం ఆగదని ఆమె స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment