గుంటూరులో విషాదం.. చిన్నారిని చంపేసిన వీధి కుక్క‌

గుంటూరులో విషాదం.. చిన్నారిని చంపేసిన వీధి కుక్క‌

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లోని గుంటూరు (Guntur) జిల్లా స్వర్ణభారతి నగర్‌ (Swarnabharathi Nagar) లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల గోపి (Gopi) అనే బాలుడు వీధికుక్కల (Stray Dogs) దాడికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం సాయంత్రం సమయంలో ఆ బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా, వీధిలో తిరుగుతున్న ఓ కుక్క ఆకస్మికంగా అతని మీదకు దూసుకొచ్చింది. కుక్క బాలుడి మెడను (Boy’s Neck) తీవ్రంగా కొరికేయడంతో తీవ్రమైన గాయాలయ్యాయి.

గ‌మ‌నించిన స్థానికులు, కుటుంబ‌స‌భ్యులు తక్షణమే బాలుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి (Guntur Government Hospital) తరలించారు. కానీ అక్కడ చికిత్స పొందుతూ గోపి ప్రాణాలు కోల్పోయాడు (Passed Away). ఈ దారుణ ఘటనతో స్వర్ణభారతి నగర్‌లో విషాదచాయలు అలముకున్నాయి. గోపి తల్లిదండ్రుల రోదనలు అందరి హృదయాలను కలిచివేశాయి.

కాగా, మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌పై త‌ల్లిదండ్రులు, స్థానికులు మండిప‌డుతున్నారు. వీధి కుక్క‌ల స్వైర‌విహారంపై ప‌లుమార్లు ఫిర్యాదులు చేసినా ప‌ట్టించుకోలేద‌ని, క‌మిష‌న‌ర్ నిర్ల‌క్ష్యం మూలంగానే త‌మ కుమారుడు మృతిచెందాడ‌ని గోపి త‌ల్లిదండ్రులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment