శ్రీకాళహస్తి (Srikalahasti) నియోజవర్గంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తు (Alcohol Intoxication) లో ఉన్న వ్యక్తి ముఖాన్ని కుక్కలు (Dogs) పీక్కుతిన్న సంఘటన శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం కాసరం (Kasaram) గ్రామంలో చోటుచేసుకుంది. కుక్కల దాడిలో వ్యక్తి ముఖంపై తీవ్ర గాయాలై.. గుర్తుపట్టని స్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళితే.. కాసరం గ్రామంలో బెల్ట్‌షాపులు (Liquor Shops) ఇష్టారీతిగా ఏర్పడ్డాయి. మద్యం విచ్చలవిడిగా లభిస్తుండటంతో శంకరయ్య (Shankarayya) మందుకు అలవాటుపడ్డాడు. ఉగాది రోజున మద్యం సేవించి అదే బెల్ట్‌షాపు ముందు అపస్మారక స్థితిలో పడిపోయాడు కేతంశెట్టి శంకరయ్య. బయటకు వెళ్లిన శంకరయ్య ఎంతసేపటికీ ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా, అతని ముఖంపై రక్తగాయాలున్నాయి. శంకరయ్య అపస్మారకస్థితిలో ఉండగా కుక్కలు అతని ముఖాన్ని పీక్కుతిన్నాయి. బెల్ట్‌షాపు నిర్వాహకుడు శంకరయ్య పడి ఉండటాన్ని పట్టించుకోకపోవడంతో ఈ దారుణం జరిగిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుక్కల దాడిలో రక్తపు మడుగులో పడిఉన్న శంకరయ్యను హుటాహుటిని తిరుపతి (Tirupati) ప్రైవేట్ ఆస్పత్రికి తరిలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో వైన్‌షాపుల ఏర్పాటు తరువాత ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్‌షాపులు ఏర్పడిన విషయం తెలిసిందే.