ఇంగ్లండ్ వన్డే జట్టుకి కొత్త సార‌ధి బెన్ స్టోక్స్?

ఇంగ్లండ్ వన్డే జట్టుకి కొత్త సార‌ధి బెన్ స్టోక్స్?

Summarize with AI

ఇంగ్లండ్ వన్డే జట్టు కొత్త కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ నియమితుడయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే, టీ20 జట్టుకు హారీ బ్రూక్ సారథ్యం వహించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉండగా, స్టోక్స్ ఇప్పటికే రెండు సార్లు వన్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, అతనిని మళ్లీ జట్టులో కొనసాగించేందుకు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఇంగ్లండ్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబరిచిన తర్వాత, కెప్టెన్ జోస్ బట్లర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ల ఎంపికపై ECB దృష్టి సారించింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment