కోలీవుడ్ (Kollywood) హీరో విజయ్ (Vijay) నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ (‘Jana Nayagan’) (తెలుగులో ‘జననాయకుడు’) విడుదలపై సందిగ్ధత నెలకొంది. బాలకృష్ణ ‘నేలకొండ భగవంత్ కేసరి’కి రీమేక్‌గా హెచ్. వినోత్ (H. Vinoth) దర్శకత్వం వహించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయాలని నిర్ణయించారు.
అయితే, ఇటీవల కరూర్ లో జరిగిన విజయ్ పార్టీ ప్రచారంలో చోటుచేసుకున్న తొక్కిసలాట కారణంగా 40 మందికి పైగా మరణించారు. ఈ ఘటనపై విమర్శలు, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్న నేపథ్యంలో, సినిమాను విడుదల చేస్తే ప్రజాగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
దీని కారణంగా, ‘జననాయకుడు’ సినిమాను వాయిదా వేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే, ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్లే అవుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.








