సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘SSMB29’పై సినిమాప్రేమికుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాపై పృథ్వీరాజ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “రాజమౌళి సినిమా కోసం నేను గత ఏడాది నుంచే పని చేస్తున్నా. ఈ ప్రాజెక్ట్‌లో భాగమవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతానికి చిత్రీకరణ దశలో ఉంది” అని తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాజమౌళి, మహేశ్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో సంచలనాన్ని సృష్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.