SS Rajamouli: ఆర్ఆర్ఆర్‌-2 ఉంటుందా? ఉపాసన ప్రశ్నకు రాజ‌మౌళి ఆన్స‌ర్‌

SS Rajamouli: ఆర్ఆర్ఆర్‌-2 ఉంటుందా? ఉపాసన ప్రశ్నకు రాజ‌మౌళి ఆన్స‌ర్‌

లండన్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్ సందడి చేసింది. లండన్‌లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటైంది. ఈ స్క్రీనింగ్‌తో పాటు ఓ ఆర్కెస్ట్రా ప్రదర్శన కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో పంచుకుంది. “ఆర్ఆర్ఆర్ ఫరెవర్” అంటూ క్యాప్షన్ పెట్టింది.

మే 11న రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ఆనందంగా కనిపించారు. “నాటు నాటు” పాట ఆడుతుండగా ఒకరి చేతిని ఒకరు పట్టుకుని ఉత్సాహంగా చూసారు. ఆ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు రాజమౌళిని సరదాగా ఆటపట్టించారు. ముగ్గురూ కలిసి నవ్వులు పంచుకుంటూ సందడి చేశారు. ఈ ఈవెంట్‌లో ఉపాసన కొణిదెల, ఎన్టీఆర్ భార్య ప్రణతి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంలో ఉపాసన, “ఆర్ఆర్ఆర్-2 ఉంటుందా?” అని రాజమౌళిని అడిగింది. రాజమౌళి “అవును” అని సమాధానమిచ్చారు. ఉపాసన వెంటనే “గాడ్ బ్లెస్ యూ” అంటూ ఆశీర్వదించింది. ఈ సరదా సంభాషణ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దాదాపు మూడేళ్ల తర్వాత రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు మళ్లీ ఒక వేదికపై కలిశారు.

సినిమాల విషయానికొస్తే, జూనియర్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 25, 2026న విడుదల కానుంది. రామ్ చరణ్ “ఉప్పెన” ఫేమ్ బుచ్చి బాబు సనా దర్శకత్వంలో “పెద్ది” అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఎస్ఎస్ రాజమౌళి తొలిసారి మహేష్ బాబుతో “ఎస్ఎస్ఎంబీ29” వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment