2 గంటల్లో శ్రీవారి దర్శనం.. టీటీడీ నూతన ప్రయోగం

2 గంటల్లో శ్రీవారి దర్శనం.. టీటీడీ నూతన ప్రయోగం

భ‌క్తుల‌కు తిరుమల శ్రీవారి దర్శనాన్ని మరింత వేగవంతం చేయడానికి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. కేవలం 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అమలు చేయాలనుకుంటున్నారు.

బెంగళూరుకు చెందిన ఓ సంస్థ టీటీడీ ఛైర్మన్ కార్యాలయంలో ఈ టెక్నాలజీకి సంబంధించిన డెమోను ప్రదర్శించింది. ఈ డెమోలో టోకెన్ జారీ, ఫేషియల్ రికగ్నిషన్, బ్యారియర్ గేట్ వద్ద ఆటోమెటిక్ ఓపెనింగ్
వంటి ప్రక్రియలను టీటీడీ అధికారులు వీక్షించారు. ఈ టెక్నాలజీ విజయవంతంగా అమలయ్యే సూచనలు కనిపిస్తున్నప్పటికీ, మరికొన్ని సంస్థ‌ల‌ డెమోలను వీక్షించిన అనంత‌రం మెరుగైన సేవ‌లు అందించే సంస్థను ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ కోసం AI సాఫ్ట్‌వేర్‌ను అందించడానికి నాలుగు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment