ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వినుత కోట బ‌హిరంగ లేఖ‌

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు వినుత కోట బ‌హిరంగ లేఖ‌

శ్రీకాళహస్తి (Sri Kalahasti)  ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ (Temple Trust Board) పదవి ఎంపిక కూటమి నేతల్లో చిచ్చు రేపుతోంది. చైర్మ‌న్ ప‌ద‌విని జనసేన (Janasena) నేత కొట్టే సాయి ప్రసాద్‌ (Kotte Sai Prasad)కు క‌ట్ట‌బెట్ట‌డంపై ఆ పార్టీకి సంబంధించిన మాజీ నేత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ మాజీ ఇన్‌చార్జి వినుత కోట (Vinuta Kota), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు బహిరంగ లేఖ రాశారు. కొట్టే సాయి ప్రసాద్ నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, పునరాలోచించాలని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను విజ్ఞప్తి చేశారు.

“నాపై జరిగిన రాజకీయ కుట్రల్లో ప్రధాన పాత్రధారి కూడా కొట్టే సాయే. దీనికి సంబంధించిన ఆధారాలు ఇప్పటికే జనసేన కేంద్ర కార్యాలయానికి, మంత్రి నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar)కి సమర్పించాను. మహిళలంటే కనీస గౌరవం లేని వ్యక్తికి పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడం సమంజసం కాదు ” అని వినుత కోట ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు రాసిన లేఖ‌లో పేర్కొన్నారు.

నిజాయితీగా కష్టపడి పనిచేసిన అర్హులను గుర్తించి పదవి ఇవ్వాలి గాని, కుట్రల్లో పాల్గొన్న వారికి ఇలాంటి గౌరవం ఇవ్వడం తగదని వినుత కోట తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. త్వరలోనే పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని వినుత కోట హెచ్చరించారు. వినుత కోట లేఖ‌తో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ నియామకం చుట్టూ వివాదం మరింత వేడెక్కింది.

గ‌తంలో ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డిపై..
డ్రైవ‌ర్ రాయుడు హ‌త్య కేసులో వినుత కోట ఇటీవ‌ల విడుద‌ల‌య్యారు. వినుత భ‌ర్త ప్ర‌స్తుతం జైల్లోనే ఉన్నారు. అయితే రాయుడు హ‌త్య కేసులో అరెస్ట్ అయిన స‌మ‌యంలో ఈ మొత్తం సంఘ‌ట‌న వెనుక శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ఉన్నార‌ని వినుత దంప‌తులిద్ద‌రూ ఆరోపించిన విష‌యం తెలిసిందే. ఆ త‌రువాత ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నాలుగు రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి.. అన్నీ సెట్‌రైట్ చేసుకొని శ్రీ‌కాళ‌హ‌స్తిలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌ని స్థానికులు గ‌తంలో చ‌ర్చించుకున్నారు. తాజాగా శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌య చైర్మ‌న్ ప‌ద‌వి విష‌యంలోనూ వినుత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌న‌పై జ‌రిగిన రాజ‌కీయ కుట్ర‌లో సాయిప్ర‌సాద్ ప్ర‌ధాన‌మైన వ్య‌క్తి అని ఆరోపించ‌డం జ‌న‌సేన పార్టీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment