ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ప్రారంభంలోనే భారీ హైప్ క్రియేట్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) – 286 పరుగుల రికార్డ్ స్కోర్ తో తొలి మ్యాచ్ గెలిచి కప్పు ఖాయం అనిపించింది. సీజన్ ప్రారంభంలోనే 44 పరుగుల తేడాతో భారీ విజయం సాధించడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.
అయితే, ఆ తర్వాత దూకుడు సద్దుమణిగింది. వరుసగా నాలుగు ఓటములు ఎదురవడంతో జట్టు పూర్తి రిసెట్ అయింది. మొత్తం 11 మ్యాచుల్లో కేవలం 3 విజయాలతోనే సరిపెట్టుకుంది SRH.
సోమవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌కు ముందు ప్లే ఆఫ్స్‌పై కొద్దిపాటి ఆశలు ఉన్నా… వర్షం ఆటలోకి వచ్చి మ్యాచ్‌ను రద్దు చేసింది. దాంతో మిగిలిన అవకాశాలూ చేజారిపోయాయి. ఒక్క పాయింట్‌తోనే బయటపడిన SRH ఈసారి మరోసారి నిరాశను మిగిల్చింది. ప్లే ఆఫ్స్‌కు (Playoffs) రేస్ నుంచి ఔట్ (Out) అయిపోయి.. ఫ్యాన్స్‌ను నిరాశ పరిచింది.