ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్‌లో పాల్గొంటున్న 10 జట్లలో తొమ్మిది జట్లకు భారతీయ ఆటగాళ్లు సారథులుగా వ్యవహరిస్తున్నారు. అయితే, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు మాత్రం ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ పాట్ కమిన్స్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, SRH కూడా స్వదేశీ ఆటగాళ్లలో ఒకరికి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతోంది. ప్రత్యేకంగా తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కెప్టెన్ పదవికి సరైన ఎంపిక అవుతాడని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. SRH మేనేజ్‌మెంట్ భవిష్యత్తులో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుందా? లేకపోతే కమిన్స్ నేతృత్వానికే కొనసాగింపు ఇస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.