అంతరిక్ష పరిశోధన రంగంలో అడుగుపెట్టిన ఎలన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్పేస్‌ఎక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం దారుణంగా విఫలమైంది. టెక్సాస్‌లో గురువారం సాయంత్రం 5:30 గంటలకు ప్రయోగించిన ఈ రాకెట్ కొన్ని నిమిషాలకే నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. అయితే అంతరిక్షంలోకి వెళ్లిన కొద్ది సేపటికే రాకెట్ పేలిపోయి శిథిలాలుగా కిందపడిపోయింది.
దక్షిణ ఫ్లోరిడా-బహమాస్ సమీపంలో కిందపడిన ఈ శకలాలు తారాజువ్వల్లా కనిపించాయి. ఈ ఘటనతో ఎయిర్ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మయామి, ఫోర్ట్ లాడర్‌డేల్, పామ్ బీచ్, ఓర్లాండో విమానాశ్రయాల్లో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.
స్పేస్‌ఎక్స్ ప్రకటన..
ఈ ప్రమాదంపై స్పందించిన స్పేస్‌ఎక్స్, ఈ ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకుంటామని తెలిపింది. ముందుగా నిర్ణయించిన మార్గంలో రాకెట్ వేగంగా ప్రయాణించలేకపోయిందని, ఆ తర్వాత రాకెట్‌తో సంబంధాలు తెగిపోయాయని వెల్లడించింది. జనవరిలో కూడా ఓ ప్రయోగం విఫలమవడంతో, రెండు నెలల తర్వాత చేసిన ఈ ప్రయోగం కూడా అంగరంగ వైభవంగా ప్రారంభమై చివరకు పేలుడుతో ముగిసింది.








