బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి

బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికుల మృతి

దక్షిణాఫ్రికాలోని స్టీల్ ఫాంటైన్ ప్రాంతంలో పాడుబడిన బంగారు గనిలో చోటు చేసుకున్న ఘటన భయానక విషాదానికి కారణమైంది. ఈ గనిలో అక్రమ మైనింగ్ చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. బంగారం తవ్వకాలపై వచ్చిన ఫిర్యాదుల కారణంగా అధికారులు గనిలో సోదాలు నిర్వహించారు. ఈ పరిశోధనలలో 100 మందికి పైగా మృతి చెందినట్లు బ్రిగేడియర్ అధికారులు వెల్లడించారు. వీరితో పాటు గనిలో చిక్కుకుపోయిన మరికొందరిని రెస్క్యూ టీం కాపాడి ఆసుపత్రులకు తరలించింది.

అక్రమ మైనింగ్ కేసులు నమోదు
బంగారు గనిలో చిక్కుకున్న వారు ముఖ్యంగా ఇతర దేశాల వలసకారులు మరియు మైనర్లు అని గుర్తించారు. వీరిపై అక్రమ మైనింగ్, అతిక్రమణ కేసులతో పాటు ఇమ్మిగ్రేషన్ కేసులు కూడా నమోదు చేయనున్నట్లు బ్రిగేడియర్ అధికారి మాతే తెలిపారు.

భద్రతా లోపాలు నడుమ పెద్ద ప్రమాదం
ఈ ఘటన దక్షిణాఫ్రికాలో గనుల భద్రతాపై అనేక ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. పాడుబడిన గనుల్లో ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్న వలస కార్మికుల దుస్థితి సంచలనం సృష్టిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment