ఆమ్ ఆద్మీ పార్టీలోకి సోనియా ఎంట్రీ

ఆమ్ ఆద్మీ పార్టీలోకి సోనియా ఎంట్రీ

పంజాబీ నటి (Punjabi Actress) సోనియా మాన్ (Sonia Mann) ఆమ్ ఆద్మీ పార్టీలో (AAP) చేరడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సమక్షంలో ఆమె ఆప్‌లో జాయిన్ అయ్యారు. ఆప్ పంజాబ్ అధికారికంగా సోనియా మాన్ చేరికను ఎక్స్ వేదికగా ప్రకటించింది. ప్రముఖ కిసాన్ యూనియన్ నేత ఎస్. బల్దేవ్ సింగ్ కుమార్తె, పంజాబీ నటి సోనియా మాన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఆమెకు మా కుటుంబంలో స్వాగతం అని ఆప్ ట్వీట్ చేసింది.

సోనియా మాన్ బ్యాగ్రౌండ్
1986 సెప్టెంబర్ 10న ఉత్తరప్రదేశ్‌లోని హల్ద్వానీలో జన్మించిన సోనియా, అమృత్‌సర్‌లో పెరిగారు. ఆమె తండ్రి బల్దేవ్ సింగ్ కిసాన్ యూనియ‌న్ నాయ‌కుడు, ఆయ‌న 1986లో ఖలిస్తానీ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. సోనియా బీబీకె డీఏవీ కాలేజ్ ఫర్ ఉమెన్ (అమృత్‌సర్) నుంచి ప‌ట్టా సాధించారు. పంజాబీ, హిందీ, మలయాళం, తెలుగు, మరాఠీ చిత్రాల్లో నటించారు.

రాజకీయ ప్రస్థానం
సోనియా మాన్ పంజాబ్ అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడంతో పంజాబ్ రాజకీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన AAP ప్రభుత్వం 2027 ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో సోనియా చేరిక పార్టీకి కొత్త బలం చేకూరుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment