కాంగ్రెస్ అగ్రనాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం పొత్తికడుపు సంబంధిత సమస్య కారణంగా ఢిల్లీలోని గంగా రామ్ ఆసుపత్రిలో చేరారు. ఆస్పత్రి వర్గాల ప్రకారం, సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. వైద్యుల ప్రత్యేక బృందం ఆమెను నిరంతరం పర్యవేక్షిస్తోంది. గంగా రామ్ ఆస్పత్రి బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఛైర్మన్ అజయ్ స్వరూప్ ప్రకటన ప్రకారం ఇవాళ ఆమె డిశ్చార్జి అయ్యే అవకాశముంది.
గతేడాది డిసెంబర్‌లో సోనియా గాంధీ 78వ ఏట అడుగుపెట్టారు. రాజకీయంగా క్రియాశీలంగా కొనసాగుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితిపై కాంగ్రెస్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయి.







