ముంబై ఆడిషన్ల నుంచి ఓటీటీ వరకు.. శోభిత

ముంబై ఆడిషన్ల నుంచి ఓటీటీ వరకు.. శోభిత

‘గూఢచారి (Goodachari), మేజర్ (Major)’ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) ఇప్పుడు తన తొలి తెలుగు ఓటీటీ(OTT) చిత్రంగా ‘చీకటిలో’ (Cheekatilo) తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ పాడ్ కాస్ట్ లో తన కెరీర్ గురించి మాట్లాడిన శోభిత, తాను ముంబై (Mumbai) వెళ్లి ఆడిషన్స్ ఇచ్చి తన ప్రయాణం ప్రారంభించానని, ఒక ఏడాదికి ఇన్ని సినిమాలు చేయాలి అనే లెక్కలు ఎప్పుడూ వేసుకోలేదని స్పష్టం చేసింది.

నటిగా కొనసాగాలంటే పాత్ర నచ్చడం చాలా ముఖ్యమని, బేరాలు-లెక్కలు వేస్తే ఇండస్ట్రీలో నిలబడటం కష్టమని అభిప్రాయపడింది. అనురాగ్ కశ్యప్, మణిరత్నం లాంటి గొప్ప దర్శకులతో పని చేయడం తనకు గొప్ప సంతృప్తినిచ్చిందని చెప్పింది. అలాగే ‘చీకటిలో’ ట్రైలర్‌ను నాగచైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, తాను చేసిన పాత్రకు వంద శాతం న్యాయం చేసానని, ఫలితాన్ని ప్రేక్షకులకే వదిలేసానని శోభిత తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment