---Advertisement---

స్మితా సబర్వాల్‌కు పోలీస్‌ నోటీసులు

స్మితా సబర్వాల్‌కు పోలీసుల నోటీసులు
---Advertisement---

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రముఖ ఐఏఎస్ (IAS) అధికారి, పర్యాటక శాఖ కార్యదర్శి (Tourism Department Secretary) స్మితా సబర్వాల్‌ (Smita Sabharwal) కు అనూహ్యంగా నోటీసులు (Notices) అందాయి. కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో ఎక్స్‌లో (ట్విట్ట‌ర్‌) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిత్రాన్ని ఆమె రీ ట్వీట్ (Retweeted) చేయడమే కారణం.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల అంశం వివాదంగా మారింది. స్టూడెంట్స్ స‌హా ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు, ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ప్ర‌భుత్వం భూములు స్వాధీనం చేసుకోవ‌డాన్ని వ్య‌తిరేకించాయి. హెచ్‌సీయూలో బుల్డోజ‌ర్ల రాక‌తో పర్యావరణ నాశనం, వ‌న్య‌ప్రాణులు తీవ్ర ఇబ్బందిప‌డుతున్నాయ‌ని “హాయ్ హైదరాబాద్ (“Hi Hyderabad”)” ఎక్స్ హ్యాండిల్ నుంచి పోస్ట్ అయిన చిత్రాన్ని ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ రీ ట్వీట్ చేశారు. ఆ ఫోటోలో బుల్డోజర్లు ముందే నెమళ్లు, జింకలు ఉండటం గిబ్లీ (Ghibli) యానిమేషన్ స్టైల్‌లో ఉండటం విశేషం. కానీ, ఈ చిత్రం నిజమైనది కాదని పోలీసులు గుర్తించారు.

దీంతో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుండి స్మితాకు BNSS సెక్షన్ 179 కింద నోటీసులు జారీ చేశారు. ఇది తప్పుడు ప్రచారాన్ని ప్రోత్సహించినట్టు భావించి పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్‌కు నోటీసులు ఇచ్చినట్లు గచ్చిబౌలి పీఎస్ ఎస్‌హెచ్ఓ మహ్మద్ హబీబుల్లా ఖాన్ (Mohammed Habibullah Khan) తెలిపారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment