---Advertisement---

వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్‌.. వరుస రీట్వీట్లు

వెనక్కి తగ్గని స్మితా సబర్వాల్‌.. వరుస రీట్వీట్లు
---Advertisement---

తెలంగాణ (Telangana) లో కంచ గచ్చిబౌలి (Khancha Gachibowli) భూముల (Land) వివాదం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన విష‌యం తెలిసిందే. ఈ వివాదంపై ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్(AI) ఫొటో (Photo)ను రీట్వీట్‌ చేసినందుకు ఐఏఎస్‌ (IAS) అధికారి స్మితా సబర్వాల్‌ (Smita Sabharwal) కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కానీ, నోటీసుల జారీ తరువాత కూడా ఆమె వెనక్కి తగ్గే (Step Back) ప్రసక్తి కనిపించడం లేదు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ట్వీట్లు, ఆరోపణలు చేస్తూ ఉన్న పోస్టులను వరుసగా (Continuously) రీట్వీట్ (Retweeted) చేస్తున్నారు.

ఇంకా చాలామంది నేతలు తమ పోస్టులను డిలీట్ చేస్తున్న స‌మ‌యంలో స్మితా మాత్రం పోరాట ధోరణి వీడడం లేదు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ట్వీట్లను షేర్ చేస్తోంది. తాజాగా రెండవ రోజూ వరుసగా ప్రభుత్వ వ్యతిరేక పోస్టులను రీట్వీట్ చేసిన ఆమె, వాటిలో 100 ఎకరాల భూమిని పునరుద్ధరించాలంటూ సుప్రీం కోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాల ఫొటో కూడా ఉంది.

ఈ పరిణామాలు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఐఏఎస్‌ స్థాయిలో ఒక అధికారి ఇలా ప్రభుత్వ విధానాలను సవాల్ చేయడం కొందరికి ఆశ్చర్యంగా మారితే, మరికొందరికి అది స్ఫూర్తిదాయకంగా కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment