చంద్రబాబు ‘స్కిల్’ కేసు క్లోజ్‌.. అధికార దుర్వినియోగం – వైసీపీ

చంద్రబాబు 'స్కిల్' కేసు క్లోజ్‌.. అధికార దుర్వినియోగం - వైసీపీ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై న‌మోదైన స్కిల్ స్కామ్ కేసు (Skill Scam Case) క్లోజ్ అయ్యింది. అధికారాన్ని అడ్డంపెట్టుకొని స్కిల్ స్కామ్ కేసును క్లోజ్ చేయించుకున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఈ కేసులో 53 రోజుల పాటు జైలులో ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు అదే కేసులో నేరం జరిగిందని ఎలాంటి ఆధారాలు లేవంటూ సీఐడీ (CID) తుది నివేదిక దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ నివేదికను ఏసీబీ కోర్టు (ACB Court) స్వీకరించి స్కిల్ స్కామ్ కేసును ‘మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్’ (Mistake of Fact)గా పరిగణిస్తూ క్లోజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి గతంలో అన్ని ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపిన సీఐడీ, ఇప్పుడు పూర్తిగా భిన్నంగా నివేదిక ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. కేసును కొట్టివేయించుకునేందుకు సీఐడీ ద్వారానే కోర్టులో పిటిషన్ వేయించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. స్కిల్ స్కామ్ కేసులో మొత్తం 35 మందిపై నమోదైన కేసులను క్లోజ్ చేయగా, చంద్రబాబు సహా మొత్తం 37 మందిపై నమోదైన కేసులు ఇలా ముగిసిపోవడం అధికార దుర్వినియోగమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మండిపడుతోంది.

ఈ కేసులో గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (ED) కూడా విచారణ చేపట్టి పలువురు నిందితుల ఆస్తులను జప్తు చేయడం గమనార్హం. అంత తీవ్రమైన కేసులో ఇప్పుడు “నేరం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు” అని సీఐడీ పేర్కొనడం విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. 2023 సెప్టెంబర్ 9న స్కిల్ స్కామ్ ఆరోపణలపై చంద్రబాబును అరెస్టు చేయగా, ఆయన 53 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

స్కిల్ స్కామ్ కేసు క్లోజ్ కావడంతో చంద్రబాబుపై ఉన్న అన్ని కేసులు ఒక్కొక్కటిగా ముగిసిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులన్నింటినీ క్లోజ్ చేయించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ స్కామ్ కేసు ముగింపుతో నిజాలు బయటకు రాలేదని, అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్టగా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment