‘సింగిల్’ హిట్‌తో కేతిక శర్మ రీఎంట్రీ!

'సింగిల్' హిట్‌తో కేతిక శర్మ రీఎంట్రీ!

తెలుగు చిత్రసీమలో కొందరు నటీమణులు ఎన్ని పరాజయాలు ఎదురైనా, కొత్త అవకాశాలను సాధిస్తూ తమ కెరీర్‌ను నిలబెట్టుకుంటారు. అలాంటి ప్రయాణంలోనే ప్రస్తుతం కేతిక శర్మ (Ketika Sharma) కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ‘రోమాంటిక్’ (‘Romantic’) సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కేతిక, ఆ తర్వాత ‘లక్ష్య’, ‘రంగ రంగ వైభవంగా’, ‘బ్రో’, ‘రాబిన్ హుడ్’ వంటి వరుస చిత్రాల్లో నటించింది. అయితే, వీటిలో ఏవీ పెద్దగా విజయం సాధించలేకపోయాయి.

కానీ, ఇటీవల విడుదలైన ‘సింగిల్’ (‘Single’) సినిమా (Movie)తో ఆమెకు హిట్(Hit) లభించింది. ఈ విజయం కేతిక కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్‌లా మారిందని చెప్పుకోవాలి. ఈ విజయంతో చిన్న, మధ్యతరహా నిర్మాతల దృష్టి ఇప్పుడు కేతిక శర్మ పై పడింది. పారితోషికం తక్కువగా ఉండటం, యంగ్ హీరోల పక్కన సరిగ్గా సరిపోగలగడం వంటి అంశాలు ఆమెకు ప్లస్ పాయింట్స్‌గా మారాయి. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు అడ్వాన్స్‌లు కూడా తీసుకున్నట్లు సమాచారం వినపడుతుంది.

ఒకానొక దశలో ఆమె కెరీర్ ముగిసినట్లే అన్న వార్తలు వినిపించగా, ఇప్పుడు ‘సింగిల్’ విజయం ఆమెకు కొత్త ఊపిరినిచ్చింది. రాశీ ఖన్నా తరహాలోనే అవకాశాల వేటలో కేతిక శర్మ ప్రయాణం కొనసాగుతుందనటంలో సందేహం లేదు. త్వరలోనే ఆమె కొత్త ప్రాజెక్టుల వివరాలు అధికారికంగా వెలువడనున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment