”అంబులెన్స్‌లో ఏదో జ‌రిగింది”.. – సింగ‌య్య భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

''అంబులెన్స్‌లో ఏదో జ‌రిగింది''.. - సింగ‌య్య భార్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

పల్నాడు జిల్లా (Palnadu District)లో వైసీపీ కార్యకర్త చీలి సింగయ్య (Cheeli Singayya) మృతి (Death) కేసు (Case) రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ నేప‌థ్యంలో సింగ‌య్య భార్య (Singayya Wife) లూర్దుమేరి (Lourdumary) చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. జూన్ 18 మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) సత్తెనపల్లి పర్యటన (Sattenapalli Visit) సందర్భంగా ఆయన కాన్వాయ్‌ (Convoy)లోని వాహనం (Vehicle) కిందపడి సింగయ్య మృతి చెందాడ‌న్న ఆరోప‌ణ‌ల‌పై సింగయ్య భార్య లూర్దుమేరి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ కేసును మ‌రింత ఆస‌క్తిక‌రంగా మార్చాయి. త‌న భ‌ర్త మృతిపై అనుమానం వ్య‌క్తం చేస్తూ.. అంబులెన్స్‌ (Ambulance)లోనే ఏదో కుట్ర జరిగిందని, ఆస్పత్రికి తరలించడంలో జాప్యం చేశారని ఆరోపించారు.

లూర్దుమేరి మీడియాతో మాట్లాడుతూ.. “నా భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయి. చిన్న చిన్న గాయాలకే ఎలా చనిపోతాడు? ఆస్పత్రికి తరలించే సమయంలో అంబులెన్స్‌లో ఏదో జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. ఏదో చేశారని మాకు అనుమానంగా ఉంది” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

అంతేకాకుండా మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) మ‌నుషులు (People) దాదాపు 50 మంది తమ ఇంటికి వచ్చి, తాము చెప్పినట్లు చెప్పాలని బెదిరించారని, వ‌చ్చివారంతా తమ కులస్థులమని చెప్పి ఒత్తిడి చేశారని ఆరోపించారు. “పోలీసులు కూడా వీడియో చూపిస్తూ, కాగితాలపై సంతకాలు చేయమని ఒత్తిడి చేశారు. మేము సంతకం చేయకపోవడంతో బెదిరింపులకు దిగారు” అని లూర్దుమేరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సింగ‌య్య మృతికేసులో మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఇరికించాల‌నే కుట్ర‌తో ప్ర‌భుత్వం త‌ప్పుడు వాంగ్మూలాల‌ను సృష్టిస్తోంద‌ని వైసీపీ సానుభూతిపరులు మండిప‌డుతున్నారు.

ఈ ఘటనపై గుంటూరు పోలీసులు మొదట సింగయ్య భార్య ఫిర్యాదు ఆధారంగా డ్రైవర్‌ను ఏ-1గా వాహ‌నంలో ఉన్న‌ జగన్‌, వైసీపీ నేత‌ల‌పై కేసు న‌మోదు చేశారు. అయితే, లూర్దుమేరి తాజా వ్యాఖ్యలతో పోలీసుల వైఖరిపై ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. “పోలీసులు ప్రీ-ప్లాన్డ్‌గా కంప్లైంట్ రాసుకొచ్చి సంతకం చేయించేందుకు ప్రయత్నించారు. మేము అడ్డుకోవడంతో వారు నా మాటలను రాసుకున్నారు” అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) హైకోర్టు (High Court) ఈ కేసులో జగన్‌తో పాటు వైసీపీ నాయకులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని జూలై 1, 2025 వరకు స్టే జారీ చేసింది. సింగయ్య కుటుంబానికి జగన్ పట్ల ఉన్న అభిమానాన్ని లూర్దుమేరి తన వ్యాఖ్యల్లో ప్రస్తావించారు, ఈ ఘటన రాజకీయంగా ప్రేరేపితమైందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఈ కేసు తదుపరి విచారణ జూలై 8న జరగనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment