విశాఖపట్నం (Visakhapatnam) లోని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం (Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple) లో గోడ (Wall) కూలి ఏడుగురు భక్తులు దుర్మరణం చెందారు. అప్పన్న నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు మృత్యువాత పడడం కలకలం రేపింది. ఈ విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు (Chief Minister Chandrababu) ముగ్గురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేశారు.
కాగా, సింహాచలం గోడ కూలిన ఘటనలో కాంట్రాక్టర్ లక్ష్మణ రావు (Contractor Lakshmana Rao) ను కమిటీ సభ్యులు (Committee Members) విచారించారు. కమిటీ ముందు గోడ కట్టిన కాంట్రాక్టర్ లక్ష్మణరావు సంచలన విషయాలను బయటపెట్టారు ( Details Revealed).. కాంట్రాక్టర్ వ్యాఖ్యలు విని కమిటీ సభ్యులు సైతం షాక్‌కు గురయ్యారు. అప్పన్నస్వామి సన్నిధిలో చందనోత్సవానికి గోడను సిద్ధం చేయాలని తనకు సూచించారని, సమయం తక్కువ ఉన్నందున, తాను గోడ కట్టనని చెప్పానని వివరించాడు. దేవస్థానం, టూరిజం అధికారులు (Tourism Officials) గోడ కట్టమని తనపై ఒత్తిడి (Pressure) చేశారని, ఆరు రోజులు సమయం మాత్రమే ఉండడంతో గోడ నాణ్యంగా నిర్మాణం చేపట్టడం సాధ్యం కాదని తాను ముందే చెప్పానన్నారు. అయినా అధికారులు తనపై ఒత్తిడి పెంచడంతో నాలుగు రోజుల ముందు గోడ నిర్మాణ పనులు మొదలు చందనోత్సవానికి రెండ్రోజుల ముందు పూర్తిచేశానని, టెంపరరీ గోడ (Temporary Wall) అని చెప్పడంతోనే తాను ఆ పని ఒప్పుకొని మొదలు పెట్టానని వాస్తవాలను కమిటీ ముందు అంగీకరించాడు కాంట్రాక్టర్ లక్ష్మణరావు.
ఐదుగురు మంత్రులతో కూడిన కమిటీ పలు దఫాల్లో చందనోత్సవ ఏర్పాట్లపై సమీక్ష చేసినప్పటికీ నాసిరకంగా గోడ నిర్మాణం చేపట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. భక్తుల మృతికి దేవాదాయ (Endowments), టూరిజం శాఖ (Tourism Department) అధికారులే కారణమని కాంట్రాక్టర్ వాంగ్మూలంతో స్పష్టంగా అర్థం అవుతోంది. అసలు చందనోత్సవ ఏర్పాట్లలో భాగంగా గోడను త్వరగా నిర్మించాలని, దేవాదాయ, టూరిజం అధికారులపై ఎవరు ఒత్తిడి తెచ్చారనే అనుమానాలు భక్తుల్లో వ్యక్తం అవుతున్నాయి. దేవస్థానానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు, ప్రాణాలను బలిగొనడంపై మృతుల కుటుంబ సభ్యులు మండిపడుతున్నాయి. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా తూతూ మంత్రంగా నిర్మాణాలు చేపట్టి ఏకంగా ఏడుగురి ప్రాణాలు పొట్టనపెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ వివరణ ఆధారంగా కమిటీ ఏం చర్యలకు పూనుకుంటుందో వేచి చూడాలి.
అధికారుల ఒత్తిడితోనే.. నాలుగు రోజుల్లో గోడ పూర్తి చేశాను
— Telugu Feed (@Telugufeedsite) May 1, 2025
కమిటీ ముందు కాంట్రాక్టర్ సంచలన నిజాలు చెప్పిన లక్ష్మణరావు.#AndhraPradesh #SimhachalamTemple #SimhachalamTragedy pic.twitter.com/vrLIqhxiDx