దుబాయ్‌లో జరిగిన SIIMA అవార్డ్స్ (Awards) వేడుకలో తెలుగు చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖులు మెరిశారు. ఈ వేడుకలో హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) తన అందం, స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. రెడ్ కార్పెట్ (Red Carpet)పై ఆమె వేసుకున్న స్టైలిష్ డిజైనర్ వేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, అభిమానుల ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
నటిగా తన ప్రతిభను మరోసారి రుజువు చేసుకున్న మీనాక్షి, ‘లక్కీ భాస్కర్’ సినిమాలో అద్భుతమైన నటనకుగాను ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును అందుకున్నారు. ఈ విజయంతో ఆమె అభిమానులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. అందం, అభినయం రెండింటితో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న మీనాక్షి, SIIMA వేదికపై గెలిచిన ఈ అవార్డు తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.







