పంజాబ్‌లో సిద్దిపేట జిల్లా ఆర్మీ జవాన్ అదృశ్యం

పంజాబ్‌లో సిద్దిపేట జిల్లా ఆర్మీ జవాన్ అదృశ్యం

పంజాబ్‌ (Punjabలో విధులు నిర్వహిస్తున్న సిద్దిపేట (Siddipet) జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ (Army Soldier) అనిల్ (Anil) (30) అదృశ్యమయ్యాడు. ఆరు రోజుల నుంచి అతని ఆచూకీ లభ్యం కావడం లేదు. తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, అప్పటి నుంచి అందుబాటులో లేకుండా పోయాడు.

కొమురవెల్లి (Komuravelli) మండలం ఐనాపూర్ (Ainapur) గ్రామానికి చెందిన అనిల్ గత 11 సంవత్సరాలుగా పంజాబ్‌లో ఆర్మీ జవాన్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. గత నెలలో పదోన్నతి రావడంతో సికింద్రాబాద్‌ (Secunderabad)లోని ఆర్మీ క్యాంపులో శిక్షణ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాడు. 18 రోజుల సెలవు తర్వాత ఆగస్టు 6న తిరిగి పంజాబ్ వెళ్లి, 7న డ్యూటీలో చేరాడు.

అయితే, ఆగస్టు 8న అనిల్ తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి “నేను చనిపోతున్నాను” అని చెప్పి కాల్ కట్ చేశాడు. కుటుంబ సభ్యులు వెంటనే తిరిగి కాల్ చేసినా, ఫోన్ స్విచాఫ్ వచ్చింది. ఆ తర్వాత అనిల్ ఆచూకీ తెలియడం లేదని ఆర్మీ సిబ్బంది కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతని కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంది. తమ కుమారుడిని వెతికి పెట్టాలని ఆర్మీ అధికారులను వేడుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment