శ్రీసత్యసాయి (Sri Satya Sai) జిల్లా రామగిరి (Ramagiri) మండలంలో పాపిరెడ్డిపల్లి (Papireddypalli)లో వైసీపీ (YSRCP) కార్యకర్త హత్యకు గురయ్యారు. ఆ పార్టీ ప్రెసిడెంట్, మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. Jagan) ఆ కుటుంబాన్ని పరామర్శించి మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై ఫైరయ్యారు. మూడు సింహాలకు కాకుండా.. చంద్రబాబు (Chandrababu) మెప్పు కోసం పనిచేస్తూ తన పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్న పోలీసులకు (Police) వార్నింగ్ (Warning) ఇస్తూ.. నిబంధనలు ఉల్లంఘించిన వారి బట్టలూడదీసి (Clothes removing) చట్టం ముందు నిలబెడతామని, తప్పు చేసిన వారికి యూనిఫాం (Uniform), ఉద్యోగం (Job) లేకుండా చేస్తామని హెచ్చరించారు.
ఎందుకు భుజాలు తడుముకున్నారు..?
కాగా, జగన్ వార్నింగ్‌పై ఎస్ఐ (SI) స్థాయి అధికారి స్పందిస్తూ మాజీ ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధిస్తూ మూడు వీడియోలు రిలీజ్ చేశారు. మొదటి రెండు వీడియోల్లో జగన్ అంటూ మాట్లాడిన ఆ ఎస్ఐ.. తరువాత స్వరం మార్చి జగన్ గారూ అంటూ గౌరవ మర్యాద పలుకులతో మరో వీడియో విడుదల చేశారు. దేహధారుడ్య పరీక్షలు, పరుగు పందెం, రాత పరీక్షలు నెగ్గుకుంటూ వచ్చి వేసుకున్న ఖాకీ చొక్కా.. తీయడానికి అరటి తొక్క కాదంటూ ఓ విధమైన హావభావాలతో మాట్లాడారు. బాబు మెప్పుకోసం పనిచేసే అధికారులను ఉద్దేశించి జగన్ వార్నింగ్ ఇస్తే రామగిరి ఎస్ఐ సుధాకర్ (SI-Sudhakar) ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడని నెటిజన్ల ప్రశ్న.
టీడీపీ టికెట్ కోసం ప్రయత్నం..
రామగిరి (Ramagiri) ఎస్ఐ (SI) యూనిఫాం లేకుండా టీడీపీ (TDP)లోని కీలక నేతలతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఇతనేనా నిఖార్సయిన ఆఫీసర్ అంటూ నెటిజన్లు ట్రోల్స్ (Trolls) చేస్తున్నారు. గతంలో ఇతను గుంతకల్లు (Guntakal) నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే టికెట్ (MLA Ticket) ఆశించారని, టికెట్ కోసం రూ.7 కోట్ల డబ్బు డిపాజిట్ చేస్తానని ఒప్పుకున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీపీ టికెట్ కోసం ఆరు నెలలు డ్యూటీకి సెలవు పెట్టి మరీ వెళ్లి స్థానికంగా తన గురించి ప్రచారం చేసుకున్న విషయాలు బయటకు పొక్కుతున్నాయి. తనకు పరిటాల సునీత టికెట్ ఇప్పించేందుకు రికమండ్ చేస్తారని ఎస్ఐ సన్నిహితుల వద్ద చెప్పుకున్నట్లుగా చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ప్రత్యర్థి పార్టీలపై ఈ ఎస్ఐ తన ప్రతాపాన్ని చూపిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. టీడీపీ అండ చూసుకొనే ఎస్ఐ సుధాకర్ మాజీ ముఖ్యమంత్రిపై బహిరంగంగా ఏకవచనంతో విమర్శలు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాళ్ల మాటలు ఆణిముత్యాలా..?
తప్పు చేసిన పోలీసులకు తమ ప్రభుత్వం వస్తే శిక్ష తప్పదని వైఎస్ జగన్ వార్నింగ్ ఇవ్వడం తప్పని కొందరు పోలీసులు, ఒకవర్గం మీడియా, కూటమిలో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వైసీపీ అధికారంలో ఉండగా పోలీసులపై చంద్రబాబు (Chandrababu), లోకేశ్(Lokesh) మాట్లాడిన మాటలు ఆణిముత్యాలా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఎందుకు దెంతినడానికి వచ్చారా..? అని అచ్చెన్నాయుడు (Achennayudu). పోలీసులు సంఘ విద్రోహ శక్తులు యూనిఫాం తీసేయండని చంద్రబాబు (Chandrababu). డీఎస్పీ (DSP)ని కేసు పెట్టుకో, పోస్టింగ్‌లు నిర్ణయించేది నేను.., చించి పడదెంతా అని మాట్లాడినప్పుడు, ఎస్పీ రిషాంత్‌రెడ్డి (SP Rishanth Reddy)ని పనికిమాలిన ఐపీఎస్ ఆఫీసర్, బులుగు చొక్కా వేసుకో అని లోకేశ్ అభ్యంతరకరంగా మాట్లాడినప్పుడు ఎస్ఐ సుధాకర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. రామగిరి ఎస్ఐ కూడా పసుపు చొక్కా (Yellow Shirt) వేసుకుంటే బాగుంటుందని నెటిజన్లు సలహా ఇస్తున్నారు.
టీడీపీ తొత్తులుగా పనిచేస్తున్న 70 మంది పోలీసు అధికారుల్ని ఇప్పటికే గుర్తించాం
— YSR Congress Party (@YSRCParty) April 9, 2025
రామగిరి ఎస్ఐ సుధాకర్ ఇటీవల ఎన్నికల్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించాడు. టీడీపీ నేతలతో పర్సనల్‌గా ఫొటోలు కూడా దిగాడు
పసుపు చొక్కా వేసుకుని టీడీపీ తొత్తుగా పనిచేస్తూ నిజాయతీ గురించి… pic.twitter.com/1Gz8a1dQsH
గుంతకల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి SI సుధాకర్ యాదవ్ గారు👌 @JaiTDP
— Sreenath Boyapati (@sreenath1089) January 21, 2024
ఫ్రెండ్ కి కాల్ చేసి ఎవరు ఈ సుధాకర్ గారు అని అడిగాను.
సార్ చాల నిజాయితీ పరుడని చాల మంచి వారు అని ప్రజల కోసం ప్రజల తరుపు పోరాడే వ్యక్తి అని ప్రజల సేవకై పాటుపడే వారని తెలిసింది.
గుంతకల్ ✅ #RaaKadaliraa pic.twitter.com/vQJTV264KW
🚨 SI Sudhakar Yadav Suspended ?🚨
— YSRCP USA (@YSRCPUSOfficial) April 9, 2025
Sudhakar Yadav నువ్వు అంత నిజాయితీ గల వాడివి అయితే ఎం పనులు చేసావ్ అని నిన్ను ఉద్యోగం లో నుండి సస్పెండ్ చేశారు..?
కనిపించని ఆ నాలుగో సింహమేరా మన సుధాకరుడు🔥😂#Justasking pic.twitter.com/yEdwLkb5uf
పచ్చ చొక్కా వేసుకున్న నిజాయితీ గల ఎస్సై గారికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు..పోలీసుల గురించి ఎలా మాట్లాడుతున్నాడో కనబడలేదా..? pic.twitter.com/zIAj1Q5TXL
— Surya YSRCP (@Surya___YSRCP) April 9, 2025