2023లో వరుసగా వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ వంటి భారీ హిట్లతో టాలీవుడ్లో ఫుల్ జోష్ చూపించిన శృతి హాసన్ స్పీడ్‌కు 2024లో బ్రేక్ పడింది. బాయ్‌ఫ్రెండ్ శాంతను హాజరికాతో బ్రేకప్ తర్వాత పర్సనల్ లైఫ్ నుంచి త్వరగానే బయటపడినా, సినిమాలకన్నా సింగింగ్పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కాదలిక్క నేరమిల్లే, థగ్ లైఫ్ చిత్రాలకు పాటలు పాడటమే కాకుండా, వారణాసిలో టైటిల్ అనౌన్స్మెంట్ ఫంక్షన్లో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి తన టాలెంట్‌ను మరోసారి చూపించింది. రజనీతో కూలీలో స్క్రీన్ షేర్ చేసిన తర్వాత కొత్త సినిమాలపై అప్డేట్స్ లేకపోవడంతో శృతి కెరీర్‌పై డౌట్స్ మొదలయ్యాయి.
ఈ సందేహాలకు ఆమె 40వ బర్త్‌డే సందర్భంగా క్లారిటీ ఇచ్చింది. సలార్ 2లో శృతి హాసన్ ఉన్న విషయాన్ని మూవీ టీం బర్త్‌డే విషెస్ ద్వారా అధికారికంగా కన్ఫర్మ్ చేసింది. అలాగే, దుల్కర్ సల్మాన్‌తో ఆకాశంలో ఓ తార సినిమాలో నటిస్తూ మళ్లీ టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వబోతుండటం ఫ్యాన్స్‌ను ఎక్సైట్ చేస్తోంది. బర్త్‌డే స్పెషల్‌గా విడుదలైన పోస్టర్లో సిగార్ కాలుస్తున్న శృతి లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరోవైపు చియాన్ విక్రమ్ 63, విజయ్ సేతుపతి–మిస్కిన్ సినిమా ట్రైన్ వంటి ప్రాజెక్ట్స్‌పై ఆసక్తికర చర్చ నడుస్తుండగా, శృతి హాసన్ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేందుకు సిద్ధమవుతోందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.








