పంజాబ్ కింగ్స్ (Punjab Kings) కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Ayer)కి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) భారీ జరిమానా (Fine) విధించింది. బుధవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ నాయకత్వంలోని పంజాబ్ జట్టు స్లో ఓవర్ రేట్ (Slow Over Rate) తో ఆడింది. ఈ కారణంగా కెప్టెన్ శ్రేయస్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు.
బీసీసీఐ ప్రకారం, “ఇది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం తీసుకున్న చర్య. ప్రస్తుత సీజన్‌లో ఇది తొలిసారి కావడంతో, శ్రేయస్ అయ్యర్‌కు రూ.12 లక్షల జరిమానా విధించబడింది” అని అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఐపీఎల్‌లో ఓవర్ల వేగంపై బీసీసీఐ కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఈ చర్య ద్వారా తెలుస్తోందంటున్నారు ఐపీఎల్ ఫ్యాన్స్.