---Advertisement---

దూబే ఉంటే భారత్ ఓడిపోదు.. లాజిక్ అదుర్స్‌

దూబే ఉంటే భారత్ ఓడిపోదు.. లాజిక్ అదుర్స్‌
---Advertisement---

భారత క్రికెట్ జట్టు వరుస విజయాలు సాధిస్తున్న వేళ, ఓ ఆసక్తికరమైన రికార్డు ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. ఆల్‌రౌండర్ శివమ్ దూబే జట్టులో ఉంటే, భారత్ ఓడే ప్రసక్తే లేదట. శివమ్ దూబే భారత జట్టులో ఉన్న 30 అంతర్జాతీయ T20 మ్యాచ్‌లలో భారత్ ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఈ రికార్డు ప్రపంచ క్రికెట్‌లో అత్యంత అరుదైనదిగా నిలిచింది.

దూబే తన తొలి T20 మ్యాచ్‌ను 2019 నవంబర్ 3న బంగ్లాదేశ్ పై ఆడగా, ఆ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. అలాగే, తొలి 5 మ్యాచ్‌లలో 2 ఓటములు ఎదురయ్యాయి. కానీ, 2019 డిసెంబర్ 11న విండీస్‌పై విజయం సాధించిన తర్వాత, దూబే జట్టులో ఉన్న ప్రతీసారి భారత జట్టు గెలిచింది. ఈ విశేష రికార్డు నేపథ్యంలో అభిమానులు దూబేను “లక్కీ మ్యాన్” అని ప్రశంసిస్తున్నారు. అతను జట్టులో ఉన్నంతకాలం భారత విజయ పరంపర కొనసాగుతుందా? చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment