Shine Tom Chacko : డ్ర‌గ్స్ కేసులో ‘ద‌స‌రా’ విల‌న్‌ అరెస్టు

డ్ర‌గ్స్ కేసులో 'ద‌స‌రా' విల‌న్‌ అరెస్టు

Summarize with AI

ద‌స‌రా (Dasara) సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన‌ మలయాళ సినీ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko)ను కేరళ పోలీసులు (Kerala Police) అరెస్టు (Arrest) చేశారు. మాదకద్రవ్యాల వినియోగం, కుట్రకి సంబంధించిన కేసులో అతనిపై ఎన్‌డీపీఎస్ చట్టం (NDPS Act) 27, 29 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చాకో ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు.

డ్రగ్స్ రైడ్‌పై విచారణకు హాజరు
ఇటీవల కొచ్చి నగర పోలీసులు షైన్ చాకోకు సమన్లు జారీ చేయగా, శనివారం ఉదయం ఆయన విచారణకు హాజరయ్యారు. ఈ వారం ప్రారంభంలో జిల్లా యాంటీ నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (DANSATF) ఎర్నాకుళంలో నిర్వహించిన నార్కోటిక్స్ రైడ్ (Narcotics Raid) సందర్భంగా చాకో హోటల్ (Chacko Hotel) నుంచి పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి. బుధవారం రాత్రి పోలీసులు హోటల్‌కు వచ్చినట్లు తెలుసుకున్న షైన్ చాకో, మూడో అంతస్తు గదిలోని కిటికీ నుంచి రెండో అంతస్తు టెర్రస్‌పైకి దూకినట్లు సమాచారం. అక్కడి నుంచి స్విమ్మింగ్ పూల్‌ మీదుగా పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే, పోలీసులను దుండగులుగా భావించి తప్పించుకున్నానని, తలుపు వద్ద వారు ఉన్నారన్న విషయం తనకు నిజంగా తెలియలేదని చాకో విచారణలో తెలిపినట్టు సమాచారం.

కాల్ డేటా, మెసేజ్‌ల హిస్టరీ సేకరణ
కేసుకు సంబంధించి పోలీసులు షైన్ చాకో కాల్స్, మెసేజ్‌ల హిస్టరీ, డివైజ్ డేటా వంటి అంశాలను సేకరిస్తున్నట్టు సమాచారం. అయితే ఆయనపై నమోదైన కేసులు బెయిలబుల్ నేరాలు కావడంతో, అతను త్వరలో బెయిల్‌పై విడుదలయ్యే అవకాశం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment