ఇంకా ఎంత‌కి దిగ‌జారుతారు..? – ఆఫ్రిదికి ధావ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

ఇంకా ఎంత‌కి దిగ‌జారుతారు..? - ఆఫ్రిదికి ధావ‌న్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌

పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ (Shahid Afridi) కి టీమిండియా గ‌బ్బ‌ర్‌.. మాజీ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ (Shikhar Dhawan) స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ఇటీవల భారత సైన్యంపై ఆఫ్రిది చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై శిఖర్ ధావన్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యారు. ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ధావ‌న్ స్పందించారు. “మేం మీ దేశాన్ని కార్గిల్ యుద్ధం (Kargil War) లో ఓడించాం. ఆ విషయాన్ని మర్చిపోయావా? మీరు ఇప్పటికే చాలా దిగజారిపోయారు. ఇంకా ఎంతకి దిగజారతారు? ఇలాంటి అర్థంలేని వ్యాఖ్యలు చేయడం మానేయండి. మీ దేశ పరిస్థితిని మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టండి. భారత సైన్యం గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. మేమంతా భారత సైన్యంపై గర్వంగా ఉన్నాం” అని శిఖ‌ర్ ధావ‌న్ కౌంట‌ర్ ఇచ్చారు. ధావన్ ట్వీట్ (Dhawan’s Tweet) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దేశభక్తితో కూడిన ధావన్ కౌంటర్‌కు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి అనంత‌రం పాకిస్తాన్‌పై భార‌త్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉంది. అమాయ‌క టూరిస్టుల ప్రాణాల‌ను తీసిన టెర్ర‌రిస్టుల‌కు, వారి ప్రోత్స‌హిస్తున్న పాకిస్తాన్‌ (Pakistan) కు త‌గిన గుణ‌పాఠం చెప్పేందుకు ప్లాన్ చేస్తోంది. భార‌త జ‌వాన్లు ఉగ్ర‌వాదాల‌ను గుర్తించే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment