హసీనా కుమార్తెపై అవినీతి ఆరోపణలు: సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌ఓ

హసీనా కుమార్తెపై అవినీతి ఆరోపణలు: సెలవుపై పంపిన డబ్ల్యూహెచ్‌ఓ

బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని (Former Prime Minister) షేక్ హసీనా (Sheikh Hasina) కు మరో షాక్ తగిలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)లో విధులు నిర్వర్తిస్తున్న ఆమె కుమార్తె సైమా వాజెద్‌ (Saima Wazed)ను సెలవుపై పంపించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై అవినీతి కేసులు నమోదు చేయడంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

సైమా వాజెద్ ప్రస్తుతం డబ్ల్యూహెచ్‌ఓ (WHO ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజినల్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఆమె సెలవులో ఉన్నారని మీడియా అడిగిన ప్రశ్నకు డబ్ల్యూహెచ్‌ఓ స్పందించింది, అయితే ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెల్లడించడానికి నిరాకరించింది. ఆగ్నేయ ఆసియా ప్రాంత రీజినల్ కార్యాలయం దిల్లీలో ఉంది. సైమా స్థానంలో డాక్టర్ కేథరినా బోహ్మే తాత్కాలిక బాధ్యతలు తీసుకోనున్నారు. బంగ్లాదేశ్‌లోని అవినీతి నిరోధక కమిషన్.. సైమాపై అధికార దుర్వినియోగం, మోసం, ఫోర్జరీ అభియోగాలు మోపింది. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ చర్యలు చేపట్టింది.

హసీనాపై తీవ్ర నేరాభియోగాలు: ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రైబ్యునల్
విద్యార్థుల ఆందోళనలతో అనూహ్యంగా ప్రధాని పీఠం నుంచి దిగిపోయిన షేక్‌ హసీనా బంగ్లాదేశ్‌ను వీడి గతేడాది ఆగస్టు 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్నారు. నిరసనల సమయంలో ఆమె పార్టీ అవామీ లీగ్ మద్దతుదారులైన హిందూ మైనారిటీలు, వారి ప్రార్థనా మందిరాలపై పెద్దఎత్తున దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో వందల మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. దీంతో యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హసీనాపై హత్య సహా పలు అభియోగాలపై కేసులు నమోదు చేశారు. ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రైబ్యునల్ హసీనాకు ఆరు నెలల జైలు శిక్ష వేసింది. కోర్టు ధిక్కరణ కేసులో ఈ తీర్పు వెలువరించింది. అలాగే ఆమెను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో.. సైమా వాజెద్‌పై కేసు నమోదు కావడం షాక్ ఇచ్చింది. సైమా వాజెద్ అంశంపై బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ప్రెస్ సెక్రటరీ షఫీఖుల్ అలామ్‌ స్పందిస్తూ, డబ్ల్యూహెచ్‌ఓ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment