ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ షర్మిల, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “విజన్-2047” పేరుతో ప్రజలను దగా చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రం ఎదగాలంటే “విజన్లు” కాదని, విభజన హామీలు నెరవేరాలని ఆమె అన్నారు. ప్రజలను తప్పుదోవపట్టించడం కోసం విజన్లు అంటూ కూటమి ప్రభుత్వం మాటలు చెబుతుందని షర్మిల మండిపడ్డారు.
అదే సమయంలో, గత పదేళ్లుగా ప్రత్యేక హోదా, పన్నుల్లో రాయితీలు, పరిశ్రమలు, ఉపాధి సృష్టి అంతా నిలిచిపోయాయన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా ప్రధాని మోడీ తాత్సారం చేస్తున్నారని, ముఖ్యమంత్రులుగా చంద్రబాబు, జగన్ హామీలు సాధించకుండా కాలక్షేపం చేశారన్నారు.