సివిల్స్ టాప‌ర్‌.. ఎవ‌రీ శక్తి దూబే..? విజయం వెనుక కథ

సివిల్స్ టాప‌ర్‌.. ఎవ‌రీ శక్తి దూబే..? విజయం వెనుక కథ

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) సివిల్ సర్వీసెస్ (Civil Services) పరీక్ష 2024లో టాప్ ర్యాంక్‌ (Top Rank) సాధించిన శక్తి దూబే (Shakti Dubey) ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరు? ఏ స్థాయి నుంచి వచ్చి ఈ గొప్ప విజయాన్ని సాధించింది? ఇప్పుడు నెటిజన్లు గూగుల్‌లో శక్తిదూబే పేరుతో వెతుకులాడుతున్నారు.

శక్తి దూబే ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) కు చెందినవారు. ఆమె UPSC 2024 ఫలితాల్లో టాప్ ర్యాంక్ సాధించింది. అలహాబాద్ విశ్వవిద్యాలయం (University of Allahabad) నుంచి బయోకెమిస్ట్రీలో డిగ్రీ పూర్తి చేసిన ఆమె, ఆ తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU)లో పీజీ చేసింది. సివిల్స్‌లో ఆమె ఆప్షనల్ సబ్జెక్టుగా పొలిటికల్ సైన్స్ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఎంచుకుంది.

2018 నుంచి శక్తి దూబే UPSCకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ గమ్యం వైపు అడుగులు వేసేలా ఆమెను ప్రేరేపించినది కుటుంబ నేపథ్యమే. ఆమె తండ్రి (Father) పోలీస్ డిపార్ట్మెంట్‌ (Police Department) లో పనిచేశారు. మొదట ఉద్యోగం అనిపించిన పోలీస్ సర్వీసు, ప్రజల రక్షణకు, సేవకు ఎంత ముఖ్యమో ఆమెకు అర్థమైంది. “ప్రభుత్వ వ్యవస్థల ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు” అనే ఆలోచన ఆమెను UPSC వైపు మళ్లించింది. తల్లిదండ్రుల మద్దతు ఆమెను ముందుకు నడిపింది. చివరకు దేశం మొత్తం గుర్తించే స్థాయికి ఎదిగింది. శక్తి విజయ ప్రయాణం యువతకు ప్రేరణగా నిలిచింది.

Join WhatsApp

Join Now

Leave a Comment