మాజీ సీఎం (Former CM) వైఎస్ జగన్ (Y.S. Jagan)రెంటపాళ్ల పర్యటన (Rentapalla Visit)లో ప్రమాదానికి గురై మృతిచెందిన సింగయ్య (Singayya) కేసు (Case) ఏపీ (AP)లో సంచలనంగా మారింది. సింగయ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సింగయ్య భార్య తన భర్త మృతిపై అనుమానాలున్నాయని చేసిన ప్రకటన కొత్త చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో చనిపోయిన వైసీపీ కార్యకర్త సింగయ్యను సీఎం చంద్రబాబు (CM Chandrababu) కుక్క (Dog)తో పోల్చడాన్ని ఆ పార్టీ నేత శైలజానాథ్ (Shailajanath) తీవ్రంగా ఆక్షేపించారు.
దళితుడు సింగయ్య మృతిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. వైసీపీ కార్యకర్త సింగయ్యను కుక్కతో పోల్చిన సీఎం చంద్రబాబు దళితులను అవమానించారని, ఇది నీచ రాజకీయాలకు నిదర్శనమని శైలజానాథ్ ఆరోపించారు. కుప్పం (Kuppam)లో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు సింగయ్య మరణాన్ని “కుక్క చావు”తో పోల్చినట్లు ఆయన పేర్కొంటూ, ఈ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శించారు.
లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదు?
సీఎం చంద్రబాబు కుట్రలను సింగయ్య భార్య బద్దలుకొట్టిందన్నారు. ఆయన శరీరంపై చిన్న గాయాలు మాత్రమే ఉన్నాయని, ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అంబులెన్స్‌లో ఏదో అనుమానాస్పద ఘటన జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసిందన్నారు. సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా? ఇంతకన్నా నీచ రాజకీయం ఉంటుందా అని ప్రశ్నించారు. వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబుకే చెల్లిందని, సింగయ్య భార్య ఆరోపణలపై లోకేష్ ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు.
ఏడుగుర్రాలపల్లె లైంగిక దాడి కేసు
ఏడుగుర్రాలపల్లె (Edgurallapalle)లో ఒక దళిత బాలిక (Dalit Girl)పై జరిగిన లైంగిక దాడి కేసును శైలజానాథ్ ప్రస్తావించారు. ఆ బాలిక తండ్రి టీడీపీ కార్యకర్త అయినప్పటికీ, చంద్రబాబు ఆ కుటుంబానికి న్యాయం చేయలేదని, కనీసం పరామర్శించే ప్రయత్నం కూడా చేయలేదని ఆయన విమర్శించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం ద్వారా టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోందని ఆరోపించారు. “చంద్రబాబు గానీ, ఆయన మంత్రులు గానీ ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదు? లైంగిక దాడి కేసులో నిందితుడిని అరెస్టు చేయకపోవడానికి కారణం ఏమిటి?” అని శైలజానాథ్ ప్రశ్నించారు.








