బాలీవుడ్ (Bollywood) బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన తాజా చిత్రం ‘కింగ్’ (King) షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ప్రముఖ దర్శకుడు సుజోయ్ ఘోష్ (Sujoy Ghosh) తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ షూటింగ్ సమయంలో చోటుచేసుకున్న చిన్న ప్రమాదంలో షారుఖ్ ఖాన్ గాయాలపాలయ్యారని (Injured) ఇండస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. దీంతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు.
వైద్యులు షారుఖ్ ఖాన్‌కు ఒక నెల (Month) పాటు విశ్రాంతి (Rest) తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. గాయాల నుంచి పూర్తిగా కోలుకోవాలంటే పూర్తిస్థాయిలో విశ్రాంతి అవసరమని డాక్టర్లు అభిప్రాయపడినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం షారుఖ్ ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ వార్త బయటకు రావడంతో షారుఖ్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అంతా “గెట్ వెల్ సూన SRK” మెసేజులతో హోరెత్తిపోతున్నాయి. ‘‘షారుఖ్ బాస్ త్వరగా కోలుకుని మళ్లీ సెట్స్‌కి రా’’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇప్పటికే ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.
ఇటీవలే విడుదలైన ‘జవాన్’, ‘పఠాన్’, ‘డంకీ’ వంటి చిత్రాలతో ఘనవిజయాలు సాధించిన షారుక్, ‘కింగ్’ సినిమాతో మరోసారి భారీ హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఆయన గాయం వల్ల చిత్ర షూటింగ్ ఆలస్యం కావొచ్చన్నా, అభిమానుల ప్రేమతో త్వరగా కోలుకుంటారని బాలీవుడ్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.