---Advertisement---

కేర్ ఆస్పత్రిలో దారుణం.. వైద్యం కోసం వచ్చిన యువ‌తిపై లైంగిక దాడి

కేర్ ఆస్పత్రిలో దారుణం.. వైద్యం కోసం వచ్చిన యువ‌తిపై లైంగిక దాడి
---Advertisement---

వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ యువతిపై స్కానింగ్ ఆపరేటర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన విశాఖ న‌గ‌రంలోని రామ్‌న‌గ‌ర్‌ కేర్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే.. కైలాసపురానికి చెందిన 24 ఏళ్ల యువతి తలకు స్వల్ప గాయం కావడంతో డాక్టర్ సూచన మేరకు కేర్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించేందుకు వెళ్లింది. ఈ నేప‌థ్యంలో స్కానింగ్ రూం ఇన్‌చార్జి ప్రకాష్ (33) దుస్తులు పూర్తిగా తొలగించాలని యువతిని ఒత్తిడి చేశాడు. దుస్తులు తొలగించిన తరువాత ఆమె ప‌ట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. యువతి కేకలు వేయడంతో బంధువులు, సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రకాష్‌కు దేహశుద్ధి చేశారు.

పోలీసుల అదుపులో కామాంధుడు

ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు చేరుకొని ప్రకాష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కానింగ్ ఆపరేటర్లపై పర్యవేక్షణ లేకపోవడమే ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. గ‌తంలోనూ ఈ ఆస్ప‌త్రిలో ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గాయ‌ని స‌మాచారం.

ముఖ్యమంత్రి ఆగ్రహం
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆస్పత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment